వేలేరు – కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూలీ చేసుకునే వారికోసం కూలీ బంధు పేరుతో పథకం ప్రవేశపెడతామని, ఈ పధకం ద్వారా ప్రతి ఏడాది రూ.12 వేలు నేరుగా వారి అకౌంట్లో వేస్తామని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు..పాదయాత్రంలో భాగంగా ఆయన నేడు వేలేరు కార్నర్ మీటింగ్ లోమాట్లాడతూ,మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలోనూ మా కోసం నిలబడ్డ వేలూరు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సంపద నాలుగుకోట్ల మంది ప్రజలకు పంచాలని. కానీ నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం తెలంగాణ సంపదన దోపిడీ చేశారని ఆరోపించారు.
నీళ్లు రానివ్వడం లేదు.. నిధులు ప్రజలకు అందడం లేదు.. నిరుద్యోగులకు నియామకాలు లేవు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం పేరుతో మన సంపద మొత్తం కేసీఆర్ లూటీ చేశారంటూ ధ్వజమెత్తారు. దశాబ్దకాలంగా రాష్ట్రంలో అభివ్రుద్ధి లేకపోవడంతో ప్రజలు విసిగి, వేశారి.. కేసీఆర్ మీద ఆగ్రహంతో ఇంటింకి పంపించాలన్న లక్ష్యంతో కనిపిస్తున్నారన్నారు.. ఆదిలాబాద్ నుంచి తాను చేస్తున్న పాదయాత్రలో ప్రతి చోటా ప్రజలు ఇలాగే చెబుతున్నారన్నారు. . రాబోయె 2023 ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోబోతున్నారన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు రాకుండా చేశారని,. మన సంపద మొత్తం కేసీఆర్ కుటుంబందోచేసి.. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని ఆరోపించారు.. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మొత్తం ప్రజలకు అర్థమయిందన్నారు. వచ్చేది కాంగ్రెస్ నేత్రుత్వంలోని ప్రజాప్రభుత్వమేనని,. ఆ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని,. ప్రజల సంపద ప్రజలకే పంచుతుందని భట్టి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే కేసీఆర్ చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.. దోపిడీ చేసిన ప్రతి రూపాయిని వెనక్కు తీసుకుని ప్రజలకు చెందేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టుకునేందుకు రూ 5లక్షలు ఇస్తామని, రూ.2 లక్షల రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని వాగ్ధానం చేశారు. వంట గ్యాస్ ధరను అంధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 500 అందిస్తామని, పేదలకు రేషన్ షాపు ద్వారా 9 రకాల వస్తువులను అమ్మహస్తం పేరుతో సంచిలో పెట్టి అందిస్తామని, టీ.ఎస్.పీ.ఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా సజావుగా పరీక్షలు నిర్వహించి కొలువులు భర్తీ చేస్తామని తెలిపారు.