Monday, November 18, 2024

కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వమే…సాగ‌నంపాల్సిందే – భ‌ట్టి

ఖ‌మ్మం .. కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. పీపుల్స్ మార్చ్ ముగింపు సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌లో భ‌ట్టిని రాహుల్ గాంధీ స‌త్క‌రించారు.. పాద‌యాత్ర‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసినందుకు అభినందించారు.. అనంత‌రం భ‌ట్టి అశేష జ‌న‌వాహ‌ణిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, సీఎం కేసీఆర్ ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. దీనిని రైతులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. . భారత్ జోడో యాత్రకు కొనసాగింపే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అన్నారు. అధికార మదంతో వీర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఉద్యం అన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.

పీపుల్స్ మార్చ్ సమయంలో వాగులు, వంకలు , కొండలు, గుట్టలు ఎక్కానని.. ఒక్కొక్కరిది ఒక్క దీనగాథ అన్నారు. మార్చి 16న పాదయాత్రను ప్రారంభించానని పేర్కొన్నారు. మన రాష్ట్రం వస్తే భూములు వస్తాయని అనుకున్నారని .. కానీ పోడు రైతులను అడవుల నుంచి వెళ్లగొట్టారని ఆయన మండిపడ్డారు. నేషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా పనిచేసిన వ్యక్తి .. జీవనోపాధి కోసం సోడా బండి పెట్టుకుని నడుకుంటున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాదయాత్ర చేస్తుంటే కొండంత ధైర్యం వచ్చిందని.. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకున్నానని విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement