Wednesday, November 20, 2024

Bharata Ratna – వారికి భార‌త ర‌త్న పుర‌స్కారాలు ఇవ్వడం మా ప్ర‌భుత్వం చేసుకున్న అదృష్టం – మోదీ..

న్యూ ఢిల్లీ – మాజీ ప్ర‌ధానులు పీవీ న‌ర్సింహారావు. చ‌ర‌ణ్ సింగ్ ల‌తో పాటు శాస్త్ర‌వేత్త స్వామినాథ‌న్‌ల‌కు భార‌త ర‌త్న పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ హార్షం వ్య‌క్తం చేశారు.. పీవీ ఓ మేధావి అని, రాజ‌నీత‌జ్ఞుడు అని త‌న ఎక్స్ అకౌంట్‌లో మోదీ కీర్తించారు. విభిన్న హోదాల్లో న‌ర్సింహారావు ప‌నిచేసిన‌ట్లు వెల్ల‌డించారు.
మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్‌కు కూడా భార‌త‌ర‌త్న ఇచ్చి త‌మ ప్ర‌భుత్వం గౌర‌వించింద‌న్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయ‌న త‌న జీవితాన్ని అంకితం చేశార‌న్నారు. చరణ్‌ సింగ్‌ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు గానీ దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా ఆయన గట్టిగా నిలబడ్డారని గుర్తుచేశారు. రైతు సోదరసోదరీమణుల పట్ల ఆయన చూపిన అంకితభావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసి కృషి యావత్‌ భారతదేశానికి ఆదర్శనీయమని మోదీ పేర్కొన్నారు. శాస్త్ర‌వేత్త స్వామినాథ‌న్‌కు కూడా భార‌త ర‌త్న ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement