దిల్లీ: మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. తెలుగు బిడ్డకు అత్యున్నత పురస్కారం లభించింది. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు.