Saturday, November 23, 2024

Bharat Jodo Yatra : ఏపీలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (వీడియో)

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో ఉత్సాహంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది. రాహుల్ పాద‌యాత్ర కర్ణాటకలో ముగిసి శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా డీహీరేహాళ్ స‌రిహ‌ద్దుకు మండలం లింగంపల్లి వద్దకు చేరుకుంది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఏపీఐఐసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఘ‌న‌ స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ డి.హీరేహాళ్ లోని మారెమ్మ గుడి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ సాయంత్రం ఓబుళాపురం మీదుగా ఆయన బళ్లారికి బయల్దేరతారు. అనంతపురం జిల్లాలో 12 కిలోమీటర్ల పాదయాత్ర కొన‌సాగించి… తర్వాత కర్ణాటకలోని బళ్లారిలోకి వెళ్తారు.

ఆంధ్రాలో నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర ముగించుకుని రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా డి హీరేహాల్ మండలం కనుక్కుప్ప గ్రామం వద్దకు రాహుల్ గాంధీ భారత్ జొడో పాదయాత్ర చేరుకుంది. భారీ పోలీస్ బలగాలు నడుమ రాహుల్ గాంధీ పాదయాత్ర కొన‌సాగిస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో 12 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతున్న‌ద‌ని కాంగ్రెస్ నేత‌లు వెళ్ల‌డిస్తున్నారు. అనంతపురం జిల్లా డీ. హిరేహాళ్ మండలం జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, డి హీరేహాల్, ఓబులాపురం, ఓబులాపురం చెక్ పోస్ట్ మీదుగా కర్ణాటకలోని బళ్లారి వరకు పాదయాత్ర సాగ‌నుంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement