కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎక్కడికి వెళ్లి జనం అధిక సంఖ్యలో వస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో భాగస్వాములు అవుతున్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని బాగ్‌పట్‌లో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నది. ఉదయం 6.15 గంటలకు మావి కలన్ నుంచి జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న దేవీలాల్ చౌదరి సహా ఐదుగురు యువకులు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి
రాహుల్‌తో సంభాషించారు. తాను అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో తాను ఎంపికయ్యానని, అయితే ఎలాంటి కారణం లేకుండా రిక్రూట్‌మెంట్‌ను నిలుపుదల చేశారని రాహుల్ గాంధీ దృష్టికి దేవీలాల్ చైదరి తీసుకొచ్చాడు. అగ్నివీర్ కారణంగా నాలాంటి ఎందరో యువకులు ఎంపికైనప్పటికీ సైన్యంలో చేరలేకపోయారని చెప్పాడు. దీనిపై రాహుల్ కాస్తా తీవ్రంగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేస్తుందని.. పాత విధానం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నివీర్ ప్రక్రియను రద్దు చేయనున్నట్లు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర… అగ్నివీర్ పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement