భారతదేశంలో తయారైన ప్రపంచపు మొట్టమొదటి నాసికా కొవిడ్ టీకా ఇన్‌కొవాక్‌ను గురువారం ఆవిష్కరించారు. దీన్ని భారత్ బయోటెక్ తయారు చేసింది. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దీనిని కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి మాండవీయ నివాసంలో జరిగింది.
నాసికా కొవిడ్ వ్యాక్సిన్ ఇన్కొవాక్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గత ఏడాది నవంబరులో అనుమతి ఇచ్చింది. దీనిని వయోజనులకు హెటిరోలాగస్ బూస్టర్ డోస్‌గా వాడవచ్చని తెలిపింది. భారత్ బయోటెక్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం ఇన్‌కొవాక్ ధర ప్రైవేట్ మార్కెట్లో రూ. 800 లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325గా నిర్ణయించారు.