బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన మైనే ప్యార్ కియా చిత్రంతో ఓవర్‌నైట్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది భాగశ్రీ. అయితే వన్ ఫిల్మ్ వన్ వండర్లా కేవలం ఒక్క సినిమాకే పరిమితమైంది .. ఆ తర్వాత పలు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో మెరిశారు కాగా భాగ్య శ్రీ భర్త హిమాయ్ దస్సానీ ఆస్పత్రిలో చేరారు. అతని కుడి భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని భాగ్యశ్రీనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆస్పత్రిలో భర్తతో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘భుజంలోని రొటేటర్ కఫ్ సాయంతోనే చేతిని 360 డిగ్రీల కోణంలో తిప్పగలం. రొటేటర్ కఫ్ సరిగా లేదంటే కండరాలకు రక్తప్రసరణ ఆగిపోతుంది. చేతులు కదలిక కోల్పోతాయి. డాక్టర్లు నా భర్త భుజంలోని రొటేటర్ కఫ్‌కు విజయవంతంగా సర్జరీ చేశారు. ఇందుకు సుమారు నాలుగన్నర గంటల సమయం పట్టింది. ఇప్పుడతను కోలుకుంటున్నాడు. తిరిగి నవ్వుతున్నాడు’ అని రాసుకొచ్చింది భాగ్యశ్రీ. కాగా ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దస్సానీ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement