Tuesday, November 19, 2024

డేంజర్‌ జోన్‌లో భాగ్యనగరం.. నగరాన్ని ముంచెత్తుతున్న కాలుష్యం

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ (ప్రతినిధి) : దీపావళి తర్వత మొదలైన చలికితోడు కాలుష్యం భారీగా పెరడగడంతో హైదరాబాద్‌ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురో జుకు పెరుగుతున్న కాలుష్యం మూలంగా నిషేధిత ఉద్గారాలు ప్రమాద స్థాయిలో పెరిగి స్వచ్ఛమైన గాలి దొరకడం గగనంగా మారింది. ఫలితంగా అస్తమా, క్యాన్సర్‌, కంటిచూపు వ్యాధితోపాటు శ్వాసకోశ వ్యాధులు ప్రజలను కబళిస్తున్నాయి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) నిబంధనల ప్రకారం 10 ఘనపుటడుగుల గాలిలో 50 మైక్రో గ్రాములకు మించి ఉద్గారాలు ఉండకూడదు. హైదరాద్‌ నగరంలో గడిచిన వారంరోజులుగా 150 మైక్రో గ్రాములకుపైగా నమోదైంది. అక్టోబర్‌ 30న 153, 31న 161, నవంబర్‌ 1న 160 ఏక్యూఐ ఇండెక్స్‌ 150 మార్కు దాటింది. అలాగే ఒక లీటర్‌ నీటిలో కరిగిన ఘన పదార్థాలు 500 గ్రాములకు మించకూడదు. హైదరాబాద్‌లోని అన్నిప్రాంతాల్లో ఈ సూచిక ఎప్పుడో దాటేసింది. కాటేదాన్‌, పాశమైలారం, జీడిమెట్ల, బాలానగర్‌, ఉప్పల్‌, బొల్లారం, బాచుపల్లి, పటాన్‌ చెరువు తదితర పారి శ్రామిక వాడల్లో అయితే లీటర్‌ నీటిలో 1,000 నుంచి 1,500 వందల మిల్లి గ్రాములకు చేరుకుంది. వాహన ఉద్గారాలు, నిర్మాన వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, రసాయనాలు, ఇంధన కల్తీ, ట్రాఫిక్‌ రద్దీ వల్ల భవిష్యత్‌లో ఈ పెరుగుదల మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. డిల్లి, ముంబాయి, కోల్‌కత్తా తర్వాత అత్యధిక కాలుష్య నగరంగా ఇండియాలో నాలుగో స్థానాన్ని, దక్షిణాదిలో మొదటి స్థానాన్ని హైదరాబాద్‌ చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

60లక్షలు దాటిన వాహనాలు ..

2022 అంచనాల ప్రకారం కోటి దాటిన హైదరాబాద్‌ జనాభాకు 60లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో 10శాతం పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కాగా 90శాతం వాహనాలు ప్రైవేటు వ్యక్తులవే కావడం గమనార్హం. ఈ వాహనాలు ప్రతీరోజు 50 లక్షల లీటర్ల పెట్రోల్‌, 30 లక్షల లీటర్ల డిజిల్‌ను వినియోగిస్తూ పరిమితికి మించి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. వాహననాల పెరుగుదల ఇలాగే ఉంటే భవిష్యత్‌లో హైదరాబాద్‌ మరో ఢిల్లిd అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. వాయు, జల కాలుష్యాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

- Advertisement -

కానరాని నిఘా ..

పరిశ్రమలపై అధికారుల నియత్రణ లేకపోవడం వల్లే పరిశ్రమలు నిబంధనలకు విరుద్దంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని బట్టి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ కేటగిరీలుగా విభజించారు. ఇందులో రెడ్‌ క్యాటగిరీలో ఉన్న పరిశ్రమలు తీవ్ర స్థాయిలో కాలుష్యం వెదజల్లేవి కాగా, పరిశ్రమలు మోతాదు స్థాయిలో కాలుష్యం వెదజల్లేవి ఆరెంజ్‌ కేటగిరి పరిశ్రమలు, గ్రీన్‌ కేటగిరీలో ఉన్న పరిశ్రమల్లో కాలుష్యం వెలువడదని పీసీబీ నింబంధనలు సూచిస్తున్నాయి. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమౌతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి మాటలకే పరిమితమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల పచ్చదనం కనుమరుగై పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంటున్నా పీసీబీ అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పడు మాత్రమే అధికారులు మొక్కుబడిగా స్పందించడం మినహా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement