అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహానుభావుడు డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ అని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సివిల్ హాస్పిటల్ చౌరస్తాలో ఆది హిందు ఉద్యమ పితా మహుడు డా.భాగ్య రెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై.సునీల్ రావు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాలకు విద్యా విప్లవాన్ని సృష్ఢించి మాహాత్మ జ్యోతి రావు పూలే వారసత్వాన్ని కొనసాగించిన భాగ్యరెడ్డి వర్మ మహనీయుడని అన్నారు.
వారి స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డి వర్మ పాఠశాలను ప్రారంభించి చదువును అందించారన్నారు. బౌద్ధ సాంస్కృతిక ఉద్యమాన్ని సైతం కొనసాగించారన్మారు. బౌద్ధ సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగించడమే భాగ్యరెడ్డి వర్మకు నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మేదరి భాగ్యరెడ్డి వర్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి, సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మేడి మహేష్, కాలువల రామచంద్రం, దామెర సత్యం, కాడ శంకర్, నాయిని ప్రసాద్, బొగ్గుల మల్లేశం, గంటల రేణుక, వెన్న రాజ మల్లయ్య, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.