Friday, November 22, 2024

పంజాబ్‌ సీఎంగా16న మాన్‌ ప్రమాణ స్వీకారం..

పంజాబ్‌ సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించిన భగవంత్‌ మాన్‌ 16వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా బాధ్యతలు తీసుకుంటారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుతం కొలువుదీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం 92 మంది ఎమ్మెల్యేలతో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌తో పాటు సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌లు భేటీ అయ్యారు. ఈ భేటీలో భగవంత్‌ మాన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరవుతారు. ఢిల్లి సీఎం, పార్టీ జాతీయ కనీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి మార్చి 13న అమృతసర్‌లో భగవంత్‌ మాన్‌ భారీ రోడ్‌ షో నిర్వహించనున్నారు. 92 మంది మంత్రుల బృందంతో స్వర్ణ దేవాలయాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

గవర్నర్‌తో భేటీ..

పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన భగవంత్‌ మాన్ శనివారం గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలుస్తారు. తమకు బలాన్ని నిరూపిస్తారు. 92 మంది ఎమ్మెల్యేల బలం ఉందని తెలియజేసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరుతారు. కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై చర్చిస్తారు. తాను భగత్‌సింగ్‌ స్వగ్రామమైన ఖట్కర్‌ కలాన్‌లోనే ప్రమాణం చేస్తానని ఇప్పటికే భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. తేదీ ఫిక్స్‌ అయినప్పటికీ.. వేదికపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కేజ్రీవాల్‌తో కలిసి వేదికను సైతం త్వరలో ఫిక్స్‌ చేసే అవకాశాలున్నాయి.

కేజ్రీవాల్‌ ఆత్మీయ ఆలింగనం..

శుక్రవారం భగవంత్‌ మాన్‌ తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పంజాబ్‌లో భారీ విక్టరీ తరువాత.. ఆయన ఢిల్లిలోని కేజ్రీవాల్‌ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వెళ్లగానే.. కేజ్రీవాల్‌ కాళ్లకు నమస్కారం పెట్టి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత సీఎం కేజ్రీవాల్‌ ఆయన్ను ఆత్మీయ ఆలింగం చేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లి డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాతో కూడా భగవత్‌ మాన్‌ భేటీ అయ్యారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement