మరోవైపు పంజాబ్ సీఎంగా ఆప్ నేత భగవంత్ మాన్ ఈనెల 16న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్ధానాలను దక్కించుకుని విజయ కేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్ధానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) మూడు స్ధానాలు, బీజేపీ కేవలం 2 స్థానాల్లో గెలుపొందాయి. అయిఏత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ పరాజయం పాలుకావడంతో సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు మద్యాహ్నం రాజ్‌భవన్‌కు చేరుకున్న చన్నీ గవర్నర్‌కు రాజీనామా పత్రాలను అందజేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరారు. ఇక తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. పంజాబ్ ప్రజలకు సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement