పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆప్ చీఫ్, అరవింద్ కేజ్రీవాల్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. మాన్ చేత పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురో#హత్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఇదే వేదికపై ఆయన సీఎం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ప్రజలంతా బాసంతి (పసుపు రంగు) తలపాగాలు ధరించి మాన్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో ఖట్కర్ కలన్ గ్రామం పసుపువర్ణ శోభితమైంది. కేజ్రీవాల్ కూడా పసుపు రంగు తలపాగా ధరించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లిd ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లిdలో 92 సీట్లు గెలిచింది. సంగ్రూర్ జిల్లా ధురి నియోజకవర్గం నుంచి మాన్ ఎమ్మెల్యేగా గెలిచారు.
పంజాబ్ కోసం కలిసి పనిచేద్దాం: మోడీ ట్వీట్..
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్‌కి శుభాకాంక్షలు. పంజాబ్ అభివృద్ధి కోసం, ప్రజల కోసం కలిసి పనిచేద్దాం అంటూ ట్వీట్ చేశారు.
ఆయన విజయానికి ప్రార్థనలు చేస్తూనే వుంటా..
పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం గురించి ఆయన మాజీ భార్య ఇంద్రప్రీత్ కౌర్ స్పందిం చారు. మేం శారీరకంగా చాలా దూరంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ఆయన విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తూనే వుంటాను. ఇక ముందు కూడా ఆయన సక్సెస్ కోసం ప్రార్థనలు చేస్తా. ఆయన విషయంలో నేనెప్పుడూ చెడుగా మాట్లాడలేదు అని కౌర్ అన్నారు. ఇక.. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కుమార్తె సీరత్ కౌర్ మాన్, కుమారుడు దిల్‌షాన్ మాన్ కూడా హాజరయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇంద్రప్రీత్ కౌర్ భగవంత్ మాన్ కోసం చాలా ప్రచారం చేశారు. ఆయన గెలుపులో ఆమె పాత్ర కూడా వుంది. అయితే 2015 లో వీరిద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత ఇంద్రప్రీత్ కుమారుడు, కుమార్తెతో అమెరికాలో వుంటున్నది.
మీ ఆహ్వానానికి థ్యాంక్స్: మనీశ్ తివారి (బాక్స్)
ప్రమాణస్వీకారోత్సవానికి రావాలంటూ భగవంత్ మాన్ పలువురుకి ఆహ్వానాలు పంపారు. ఈ జాబితాలో కాంగ్రెస్ నేత మనీశ్ తివారి కూడా ఉన్నారు. తనకు వచ్చిన ఆహ్వానాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న మనీశ్ తివారి, సొంత పార్టీపై విమర్శలు చేశారు. ముందుగా ఆహ్వానానికి బదులిస్తూ ప్రస్తుతం పార్లమెంట్ సెషన్‌లు జరుగుతున్నందున కార్యక్రమానికి హాజరుకాలేక పోతున్నట్లు వివరణ ఇచ్చారు. ”ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. కానీ పార్లమెంటు సెషన్ కారణంగా నేను రాలేకపోతున్నాను” అని చెప్పారు. అక్కడితో ఆగకుండా, ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే.. మా పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరైన చరణ్‌జీత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి నన్నెవరూ పిలవలేదు అంటూ విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..