Sunday, November 24, 2024

TTD | 23న తిరుమలలో భగవద్గీత, విష్ణు సహస్రనామ అఖండ పారాయణం

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి: ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి, గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల నాదనీరాజనం వేదిక పై సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం, శ్రీవిష్ణు సహస్రనామ స్త్రోత్ర పారాయణం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు నిరంతరాయంగా పారాయణం చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తారు.

అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీవేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రీయ పండితులు, టిటిడి వేద పండితులు, శ్రీఅన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఈ పారాయణ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement