Saturday, November 23, 2024

నిజాయితీకి ప్రతిరూపం..మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతి

సీపీఎం పార్టీ సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 95 ఏళ్ల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రజల సేవ తన జీవితాన్ని అంకింతం చేశారు కుంజా బొజ్జి. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కనీసం ఉండటానికి సొంత ఇళ్లు కూడా లేదు. వరరామచంద్రపురం మండలం అడవి వెంకన్నగూడెం గ్రామానికి చెందిన కుంజా బొజ్జి, ఉమ్మడి రాష్ట్రంలో 1985, 89, 1994లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

1926లో అడవి వెంకన్న గూడెం లో కుంజా బొజ్జి జన్మించారు. సాయుధ తెలంగాణా పోరాటంలో 1950లో అయన గెరిల్లా దళాల కొరియర్ గా పనిచేశారు. తరువాత 1970లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన బొజ్జి 1985 నుంచి 1994 వరకూ భద్రాచలం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  సీపీఎం పార్టీ తరపున అన్ని ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరులకు ఎన్నో సేవలందించారు. మచ్చలేని రాజకీయ నేతగా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ గిరిజనుల మనసుల్లో బొజ్జి చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణం పట్ల కమ్యూనిస్టు పార్టీల నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement