Saturday, November 23, 2024

సెలవుల్లో పిల్లలు జాగ్రత్త.. బావులు, చెరువులకు వెళ్లకుండా చూస్కోవాలే!

మేడ్చల్‌, ప్రభన్యూస్ : సరదా కోసం చెరువులు.. బావులకు ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరికలు జరీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను మైనర్‌ పిల్లలకు ఇవ్వక పోవడం మంచిదని ప్రచారం చేస్తున్నారు. లేదంటే ప్రమాదాల భారిన పడే అవకాశం ఉందని సూచనలు చేస్తున్నారు. వేసవి కాలంలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని సూచనలు చేస్తున్నారు.

నీటికి దూరంగా..

వేసవి కాలంలో పిల్లలను నీటికి దూరంగా ఉంచాలి. విద్యార్ధులు స్నేహితులతో కలసి సరదాగా ఈతకు వెళ్తుంటారు. స్నానాలు చేస్తుంటారు. కొంత మంది పాత బావుల్లో కూడ ఈతకు పోతుంటారు. వేసవి కాలంలో సరదాగా మిత్రులతో కలసి ఈత కొడుతుంటారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలు ఈత కోట్టే ముందు పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. చిన్నారులను నీటికి దూరంగా ఉంచడమే మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తతో లేకుండటే ప్రమాదాలకు అవకాశం ఉంది.

పిల్లలను వాహనాలను..

పిల్లలకు కార్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాటిని నడిపేందుకు రోడ్డెక్కి ప్రమాదాల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయంలో పోలీసు శాఖ కూడ పలు సూచనలు చేస్తుంది. వీఐనంత వరకు పిల్లలను వాహనాలకు దూరంగా ఉంచాల ని పలు సూచనలు చేస్తున్నారు. అవసమైతే పెద్దల సమక్షంలో నడిపైలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే కోరి ప్రమాదం తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఏది ఏమైనా వేసవి సెలవుల్లో చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement