Thursday, November 21, 2024

మెట్రోతో మెరుగైన ర‌వాణా.. త్వరలోనే మరో కొత్త స్కీం తెస్తాం: ఎన్‌వీఎస్‌ రెడ్డి

మెట్రో రైల్‌తో నగర వాసులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నామని, ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. అయితే కరోనా నష్టాల నుంచి కోలుకోవడానికి త్వరలో స్కీంలు ప్రవేశపెడతామని చెప్పారు. సువర్ణ ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో సువర్ణ ఆఫర్‌ రెండో నెల లక్కీ డ్రా జరిగింది. ఐదుగురు విజేతలకు స్మార్ట్‌ టీవీ, వాషింగ్‌ మిషన్‌, స్మార్ట్‌ఫోన్‌, మైక్రో ఓవెన్‌ను అందించారు. మెట్రోలో ప్రయాణం వల్ల సమయం ఆదా అవుతుందని, మహిళలు సురక్షితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కరోనాతో నష్టాలతో ఉన్న మెట్రోను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ మెట్రోతో కలిసి కొత్త స్కీమ్స్‌ ప్లాన్‌ చేస్తోందన్నారు.

అన్‌లాక్‌ తర్వాత మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం రోజూ 2 లక్షల 40వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యను ఇంకా పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాపిడో సంస్థతో టై అప్‌ అయ్యామని, మెట్రో ఫస్ట్‌ మైల్‌, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీలో భాగంగా బైక్‌ ట్యాక్సీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మెట్రో రైళ్లలో మరింతగా కోవిడ్‌ సేఫ్టీ మెజర్స్‌ను అమలు చేస్తామన్నారు. ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, మాస్కు ఉంటేనే ప్రయాణికులకు మెట్రోలో ప్రయాణం కోసం అనుమతి ఇస్తున్నామని చెప్పారు. రైళ్లను శానిటైజ్‌ చేస్తున్నామని, ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచిస్తున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement