కొత్త ఏడాది రాబోతుండటంతో తన అభిమానులకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పింది స్టార్ హీరోయిన్ సమంత. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుని కొత్త ఏడాదిలో వాటిని సాధించేందుకు కష్టపడాలని సూచించింది. అయితే లక్ష్యాలను నిర్దేశించుకునే సమయంలో సాధ్య సాధ్యాలను గమనించుకోవాలని సామ్ చెప్పింది. సులభమైన, మీరు చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలని సూచిస్తూ.. దేవుడి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయని తెలిపింది.
కొత్త ఏడాదికి ముందస్తుగా మీకు శుభాకాంక్షలు అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా తర్వాత ఏ షూటింగ్ లోనూ పాల్గొనడంలేదు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ఖుషి సినిమాలో సామ్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పటికీ సామ్ మాత్రం పాల్గొనడంలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాతే షూటింగ్ కు హాజరుకానుందట సమంత.