Tuesday, November 26, 2024

భారత్‌లో బెంజ్‌ సెడాన్‌ తయారీ..

న్యూఢిల్లి : జర్మనీకిచెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీసంస్థ సి-క్లాస్‌ సెడాన్‌ తయారీని భారత్‌లో ప్రారంభించింది. సి200, సి200డి, సి300డి వేరియంట్లలో లభించే ఈ మోడల్‌ వచ్చేనెలలో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. మహారాష్ట్రలోని పుణ సమీపంలోని చకన్‌ వద్ద కంపెనీకి చెందిన ప్లాంటులో తయారు చేయనున్నారు. కాగా 2001లో భారత్‌లోని సి-క్లాస్‌ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే 37వేలకుపైగా కార్లు భారత్‌లో వినియోగిస్తున్నారు. గతేడాది 43శాతం అధికంగా విక్రయాలు చేసిన బెంజ్‌ ఈ ఏడాది ఆ శాతాన్ని అధిగమించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2022 జనవరి-మార్చిలో విక్రయాలు గతేడది ఇదేకాలంతో పోలిస్తే 26శాతం అధికమై 4022 యూనిట్లుగా నమోదైంది. ఈక్యూఎస్‌ సెడాన్‌ ఎలక్ట్రిక్‌ మోడల్‌ను సైతం కంపెనీ ఈ ఏడాది అక్టోబర్‌-డిసెంబర్‌ చివరి త్రైమాసికంగో దేశీయంగా అసెంబుల్‌ చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement