బెంగాల్ జట్టు కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా ఎంపికయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల రాజీనామా చేసిన అరుణ్‌లాల్ స్థానంలో శుక్లాను నియమితులయ్యారు. కోచ్ భర్తీ ప్రక్రియలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పలువురు పేర్లను పరిశీలించినా… 41ఏళ్ల లక్ష్మీరతన్ శుక్లా వైపే మొగ్గుచూపింది.
ఇక బ్యాటింగ్ కోచ్‌గా వి.రామన్‌ను నియమించింది. లక్ష్మీరతన్ శుక్లా టీమిండియా తరఫున 3 అంతర్జాతీయ వన్డేలు, 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. అంతేగాక బెంగాల్ అండర్-23 జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు. ఐపీఎల్లో 47 మ్యాచ్‌లాడిన శుక్లా 405 పరుగులు చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.