బెంగాలీ నటి పల్లవి డే తన ఇంట్లో శవమై కనిపించింది. కోల్‌కతాలోని గార్ఫా ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో ఇవ్వాల ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుకొన్నారు. ఆదివారం ఉదయం ఆమె డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత ఇది ఆత్మహత్యగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పల్లవి మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని, దీనిపై అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఈ బెంగాలీ టీవీ నటి పలు ప్రోగ్రామ్స్‌లో ప్రధాన పోత్రలు చేసింది. ‘మోన్ మనే నా’లో కూడా మంచి పాత్ర చేసిందని, ఆమె రేషమ్ జాపి, సరస్వతి ప్రేమ్, అమీ సిరాజేర్ బేగంతో సహా అనేక ఇతరులతో నటించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement