గతంలో రెండుసార్లు క్యాన్సర్ ని జయించింది ప్రముఖ బెంగాళీ నటి ఐంద్రిలా శర్మ.కాగా ఆమె గత కొంత కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఐంద్రిలా ఆదివారం కన్నుమూసింది. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె నవంబర్ 1న కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. రెండు వారాలుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఐంద్రిలాకు నవంబర్ 15న గుండెపోటు వచ్చింది.
ఒకటి కంటే ఎక్కువ సార్లు గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పైనే ఉంచి ఆమెకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచింది. ఈమె మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు.ఈమె వయసు 24సంవత్సరాలు. ‘జుమూర్’, ‘జియోన్ కాథీ’ వంటి సీరియల్స్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఐంద్రిలా ‘లవ్కేఫ్’, ‘అమీ దీదీ నెం.1’ వంటి సినిమాల్లోనూ నటించింది. సబ్బులకు సంబంధించిన అనేక యాడ్స్‌లోనూ ఈమె నటించింది. ఇటీవలే రిలీజైన ‘బాగర్’ వెబ్ సిరీస్‌లో ఈమె కీలకపాత్ర పోషించింది.