Tuesday, November 26, 2024

నడి రోడ్డుపై బెంగాల్ టైగర్..పిస్టల్ గురి పెట్టిన పోలీస్..

హ్యూస్టన్ వీధుల్లో బెంగాల్ టైగర్ చక్కర్లు కొడుతోంది. అదేంటి అడవుల్లో లేదా జూపార్కుల్లో ఉండాల్సిన పులి రోడ్లపై తిరగడమేంటీ అనుకుంటున్నారా.. హ్యూస్టన్ ప్రజలు కూడా ఇలాగే షాక్ అయ్యారు. అయితే రోడ్డు మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న పులి ఓ పోలీసు అధికారి ఇంటి దగ్గర పులి కనిపించడంతో ఆయన పిస్టల్ తీసుకుని దాని వెంట పడ్డాడు. కానీ పులి మాత్రం దొరకలేదు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అది ఓ పెంపుడు పులి అని తెలిసింది. 26 ఏళ్ల విక్టర్ హ్యూగో క్యూవస్ దాని యజమాని. అతడు ఓ హత్యకేసులో నిందితుడు. బెయిలు పైన తిరుగుతున్నాడు. పోలీసులు పులి కోసం వీధుల్లో వెతుకుతుండగానే విక్టర్ కారులో పులిని ఎక్కించుకుని ఉడాయించాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఇల్లంతా గాలించినా పులి జాడ కనిపించక పోవడంతో ఖంగు తిన్నారు. పులివేట ఇంకా కొనసాగుతున్నదని ట్విట్టర్‌లో హ్యూస్టన్ పోలీసులు తెలిపారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement