పశ్చిమ బెంగాల్ పంచాయతీ శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్రతా ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. సుబ్రతా ముఖర్జీ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. దీంతో ఆయన ప్రభుత్వ ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు.
సుబ్రతా మరణంతో తృణమూల్ కాంగ్రెస్ విషాదం చోటు చేసుకుంది. సుబ్రతా మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. జీవితంలో తాను చాలా విషాదాలు చూశానని, కానీ సుబ్రతా ముఖర్జీ మృతి లోటు మాత్రం పూడ్చలేనిదన్నారు. సుబ్రతా ముఖర్జీ చాలా నిబద్ధత కూడిన వ్యక్తిత్వం అని మమతా కొనియాడారు.
కాగా, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన కాంగ్రెస్‌లో చాలాకాలం పనిచేశారు. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌కు సుబ్రతా ముఖర్జీ తొలి మేయర్‌గా పనిచేశారు.