పశ్చిమబెంగాల్ మంత్రి, యువ క్రీడాకెరటం మనోజ్ తివారీ సత్తా చాటాడు. బెంగళూరులో జరుగుతున్న రంజీ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన తివారీ…., సెంచరీ కొట్టాడు. ఈమ్యాచ్‌లో బెంగాల్ జట్టు ఝార్ఖండ్ టీంతో తలపడింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని కేబినెట్‌లో యువజన విభాగం, క్రీడల మంత్రిగా తివారీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఒక సిక్స్ కొట్టిన తివారీ… 14 సార్లు బంతిని బౌండరీ దాటించాడు. ఐదో రోజు మ్యాచ్‌లో భాగంగా బెంగాల్ జట్టు 129 పరుగులు చేశాక క్రీజులోకి వచ్చిన ఈ మంత్రి బెంగాల్ బంతిని ఎడాపెడా కొట్టేశాడు.
ఆ తర్వాత అభిషేక్ పొరెల్… ఐదో వికెట్ పడే సమయానికి 72 పరుగులు తీశాడు. 136వ పాయింట్ వద్ద రన్ అవుట్ అయ్యాడు. సుదీప్ కుమార్ ఘరామి, అనుస్టుప్ మజుందార్ చెరో సెంచరీ కొట్టారు. తొలి వికెట్‌లోనే 132 పరుగులు చేసిన అభిషేక్ రమణ్, స్కిప్పర్ అభిమన్యు బెంగాల్ జట్టులో ఉత్సాహం నింపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.