భారత జట్టుపై బర్మింగ్ హామ్‌లో జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో దూకుడుగా ఆడతామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో దూకుడుగా ఆడటంవల్లే 3-0 తేడాతో నెెగ్గామని భావిస్తున్న ఇంగ్లండ్ జట్టు సారథి భారత్‌తోనూ అదే వ్యూహంతో ముందుకు వెడతామని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు 17 మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో పేలవ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ జట్టులో ప్రక్షాళన చేశారు. బెన్‌స్టోక్స్‌ను కెప్టెన్‌గాను, హెడ్ కోచ్‌గా బ్రెండన్ ముల్లమ్‌ను నియమించారు. ఆ తరువాత న్యూజిలాండ్ పర్యటనలో స్టోక్స్ బృందం అద్భుత ప్రదర్శన కనబరచింది. కాగా ఐదు టెస్ట్ మ్యాచలతో గత ఏడాది భారత్‌తో ఇంగ్లండ్ తలపడింది.
అప్పుడు భారత జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించగా స్టోక్స్ సారథిగా లేడు. ఆ సిరీస్‌లో 2-1 భారత జట్టు ఆధిక్యం సాధించింది. కాగా కోవిడ్ మహమ్మారి కారణంగా సిరీస్ వాయిదా పడింది. ఐదవ టెస్ట్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసి జులై 1న నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకన్నా ఇంగ్లండ్‌కు ప్రాక్టీస్‌కు ఎక్కువ లభించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో విజయం సాధించి నేరుగా టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ సిద్ధమైంది. కానీ భారత్‌కు కేవలం ఇంగ్లండ్‌లో లీచెస్టర్‌తో నాలుగు రోజుల వార్మప్ టెస్ట్ మాత్రమే ఆడింది. ఆ టెస్ట్ డ్రాగా ముగియగా రోహిత్ సహా కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. బ్యాట్స్‌మన్ భరత్ ఒక్కడే ధాటీగా ఆడాడు. ఈ నేపథ్యంలో భారత-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్‌మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.