Sunday, November 24, 2024

రష్యన్‌ విమానాలకు నో చెప్పిన బెల్జియం..

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యన్‌ విమానాలను తమ గగనతలంలోకి రాకుండా బెల్జియం నిషేధం విధించింది. బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డి క్రూ ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. ప్రజలతో సత్సంబంధాలు నెరపే ఏ దేశానికైనా ఐరోపా సమాఖ్య గగనతలం అందుబాటులో ఉంటుందని, కానీ దుందుడుకు వైఖరితో వ్యవహరించేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రష్యా విమానాల రాకపోకలను నిషేధిస్తూ ఇప్పటికే బల్గేరియా, చెక్‌ రిపబ్లిగ్‌, పోలండ్‌, రొమేనియా తదితర దేశాలు నిషేదం విధించాయి.

కాగా ఇప్పుడు రష్యా కూడా అదే తీరులో స్పందించింది. లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా, స్లొవేనియా విమానాలను తమ గగనతలంలోకి అనుమతించబోమని రష్యా ప్రకటించింది. కాగా ఉక్రెయిన్‌పై రసాయనిక ఆయుధాలను రష్యా ప్రయోగించే ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌ విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ ట్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement