బీజింగ్: చైనాకు చెందిన అణుశక్తి సబ్‌మెరైన్ ‘093-417’ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఎల్లో సీలో జరిగిన ప్రమాదంలో అందులో ఉన్న 55 మంది సబ్‌మెరైనర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులోనే ఈ ప్రమాదం జరిగినా.. చైనా ఇప్పటి వరకు నోరు మెదపలేదు. తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్’ బాంబులాంటి కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. కానీ, తాజాగా బ్రిటన్ సబ్‌మెరైనర్లు కూడా ఈ ప్రమాదం విషయాన్ని ధ్రువీకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement