ఇంట్లోనే బీరు తయారు చేసే ట్రిక్ తెలిస్తే బాగుండు అనుకుంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఓ శుభవార్త. ఇక ఎంచక్కా బీరును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎప్పుడంటే అప్పుడు సీసాలకు సీసాలు తాగేయొచ్చు. కింగ్ ఫిషర్ కంపెనీ ఓ కొత్త ప్రొడక్టును మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పుడు బీర్ పౌడర్ మిక్స్ తయారు చేసింది. కింగ్ ఫిషర్ మనదేశంలో బీరు తయారీలో కింగ్ మేకర్. లీడింగ్ బీర్ బ్రాండ్ గా ఉన్న కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ప్యాకెట్లు వచ్చాయి. యునైటెడ్ బ్రివరీస్ గ్రూప్ సంస్థ కింగ్ ఫిషర్ ఇన్ స్టంట్ బీర్ ను విడుదల చేసింది. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్ ను దేశంలోని మందుబాబుల కోసం తీసుకొచ్చింది. బీర్ పౌడర్ మిక్స్.. వీటినే బీర్ సాచెట్స్ అని పిలుస్తుంటారు. ఈ బీర్ పౌడర్ తో బీరు తయారు చేయడం ఎలా అంటే.. బీర్ సాచెట్స్ , నీళ్లు ఉంటే చాలు.. క్షణాల్లో బీర్ సిద్ధమవుతుంది. మీకు దగ్గరలో జగ్ కానీ, మగ్ కానీ, మినరల్ వాటర్ డబ్బాకానీ ఏది వున్నా ఒకేసారి బీర్ పౌడర్ కలిపి నురగలు కక్కే రుచికరమైన బీరును తయారుచేసుకోవచ్చు.
Advertisement
తాజా వార్తలు
Advertisement