Sunday, November 17, 2024

బీ..కేర్ ఫుడ్‌..! నగరంలో విచ్చల విడిగా బిర్యానీ పాయింట్లు.. క‌స్ట‌మ‌ర్ల‌ ఆరోగ్యంతో చెలగాటం..

ఉరుకులు.. పరుగుల జీవితంలో యువత, ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా హోటళ్లలోని ఆహారంపైనే ఆధారపడుతున్నారు. నగరంలోని చాలా మంది రోజులో ఏదో ఒక సమయంలో బయట ఆహారం తింటున్నారు. అందుకే నగరంలో బిర్యారీ పాయింట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ ఆహారం తయారీ విషయంలో రుచి, శుభ్రత పాటిస్తున్నా..? కల్తీ లేని వాటినే ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అదే తెలిస్తే హోటళ్లలో తినే ధైర్యం చేస్తారా..? అన్ని హోటళ్లు ఇలాగే ఉంటాయని కాదు కానీ.. చాలా హోటళలో మాత్రం ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఆహార పరిశుభ్రతను గాలికొదిలేస్తూ.. ఫ్రీజ్‌లలో రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసంతో తయారు చేస్తూ.. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నగరంలో పేరున్న హోటళ్లల్లోనే ఆధ్వాన్న పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఒంగోలు, ప్రభన్యూస్‌ : హైదరాబాద్‌ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది. కానీ నగరంలో హైదరాబాద్‌ బిర్యానీ పేరుతో చేస్తున్న పాడు పనుల వల్ల ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. కల్తీ నూనెలతో పాటు, ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉన్న చికెన్‌, మటన్‌తో బిర్యానీ చేస్తూ.. వినియోగదారుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బిర్యానీ పాయింట్లతో పాటు, ప్రధాన రెస్టారెంట్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ.. వినియోగదారులతో చెలగాటమాడుతున్నారు. ఆహార తయారీ విషయంలో రుచి, శుచి, శుభ్రత పాటిస్తున్నారా..? కల్తీ లేని వాటినే ఉపయోగిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అన్ని బిర్యానీ పాయింట్లు, హోటళ్లు ఇలానే ఉంటాయని కాదు కానీ.. చాలా హోటళ్లలో మాత్రం ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రోజుల తరబడి నిల్వ ఉన్న మాంసాన్ని వినియోగిస్తున్నారని సమాచారం.

హోటళ్ల సొబగులు చూసి ఫుడ్‌ బాగుంటుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే! బడా హోటళ్లే కదా అని కేర్‌లెస్‌ చేస్తే డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కున్నట్లే. బిర్యానీ, మాంసం రుచిగా ఉండొచ్చు చికెన్‌ కర్రీ ఘుమఘుమలతో నోరూరించొచ్చు. ఇంకే లాగించేద్దాం అనుకోకండి.. బీ కేర్‌ఫుల్‌.. ఆహార భద్రత ఎంత డొల్లగా ఉందో నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతోంవి. గతంలోనూ నగరంలోని పలు హోటళ్లల్లో ఫ్రిజ్‌లో ఉన్న మాంసం నిల్వలను అధికారుల దాడుల్లో బయటపడిన సంఘటనలు విధితమే. మాంసమే కాదు.. వంట గదులు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. నిషేధిక ప్లాస్టిక్‌ కవర్లలో ఫుడ్‌ను సప్లై చేస్తుండటం గమనార్హం.

ప్లాస్టిక్‌ వినియోగం..

నిషేధిక ప్లాస్టిక్‌ను కూడా బడా హోటళ్ల దగ్గరి నుంచి బిర్యానీ పాయింట్ల వరకు యథేచ్ఛగా వినియోగిస్తూ పర్యావరణ, ప్రజారోగ్యాన్ని భక్తిస్తున్నాయి. కల్తీ ఆహారం, నిషేధిత ప్లాస్టిక్‌ వాడకంతో పెనుముప్పును కలిగిస్తున్నాయి. నగరంలో పేరున్న హోటళ్లలో సైతం ప్లాస్టిక్‌ కవర్లను కలిగి ఉండడం బాధ్యతారహిత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement