14 రోజులుగా కొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆ జిల్లాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. 14 జిల్లాల్లోని 13 జిల్లాల్లో గత నెలలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో 55.87 శాతం కొత్త కేసులు ఇక్కడే వెలుగులోకొస్తున్నాయి. కర్నాటకకు లేఖ రాశారు. ఇక్కడే రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించబడ్డాయి.
జినోమిక్స్ కన్సార్టియం కూడా రాష్ట్రంలో క్లస్టర్ వ్యాప్తిని నివేదించింది. బెంగళూరు అర్బన్‌లో మరణాలు పెరిగాయి. నవంబర్ 25తో ముగిసిన వారంలో 8 మంది చనిపోతే.. డిసెంబర్ 2తో ముగిసిన వారంలో 14 మరణాలు సంభవించాయి. కర్నాటకలోని తుమకూరు జిల్లాలో 152 కేసులు రికార్డయ్యాయి. ఒడిశా, జమ్మూ కాశ్మీర్, మిజోరం, కేరళ, తమిళనాడు జిల్లాలకు కూడా లేఖలు రాశారు. మిజోరాంలోని జిల్లాలు 17 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉంది. అలాంటి జిల్లాలో చంపై ఒకటి. జమ్మూలోని కథువాలో 736 శాతం కేసులు పెరిగాయి. కేరళలో కూడా మరణాలు భారీగా సంభవిస్తున్నాయి.