2021-22 విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లు యూనివర్సిటీల్లో పెరిగాయి. రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ యూనిర్సిటీలతో పాటు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌బీఈఈటీ) పరిధిలోని కాలేజీల్లో.. 2020-21 ఏడాది కంటే ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగి నట్టు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఈ వర్సిటీల పరిధిలోని 962 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 4,17,740 సీట్లుంటే, వాటిలో 2,29,154 మంది చేరారు. మిగతా సర్కారు రెసిడెన్షియల్, నాన్ దోస్త్ కాలేజీల అడ్మిషన్లతో కలిపి ఈ ఏడాది మొత్తం 1080 కాలేజీల్లో 4,66,345 సీట్లుంటే 2,52,248 మంది విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్లు తీసుకున్నారు. 962 కాలేజీల్లో ఈ సారి సగానికి పైగా అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీల్లోనే నమోదయ్యాయి.
డిగ్రీలో బీకామ్ కోర్సే ఎవర్‌గ్రీన్ టాప్ కోర్సుగా నిలుస్తూవస్తోంది. వరుసగా మూడేళ్లు ఈ కోర్సులోనే యువత ఎక్కువ మంది అడ్మిషన్లు పొందుతున్నారు. తమ ప్రాముఖ్యత ఫస్ట్ బీకామ్ ..ఆతర్వాతే బీఎస్సీ, బీఏ కోర్సులంటున్నారు. విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా సీఏ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బీకాం కోర్సును విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నట్లు అధ్యాపక వర్గాలు పేర్కొంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital