Tuesday, November 26, 2024

వర్షాకాలంలో జాగ్రత్త! ప్రమాదాలకు నిలయంగా మారుతున్న ఇనుప స్తంభాలు

హైదరాబాద్‌ మహానగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇనుప స్తంభాలు డేంజర్‌గా మారుతున్నాయి. వర్షాల కారణంగా ఇనుప విద్యుత్‌ స్తంభాల నుంచి ప్రమాదాలు జరుగుతాయోనని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల కురిసిన భారీవర్షాలు, ఈదురు గాలులకు బస్తీలు, కాలనీల్లో ఇళ్లకు సమీపంలో ఉన్న ఇనుప స్తంభాలు వంగిపోయాయి. భారీవర్షాలు కురిసినప్పుడు రోడ్లపై వచ్చే వరద నీటితో ఎర్తింగ్‌ సరిగాలేక ఇనుప స్తంభాలు ముట్టుకుంటే విద్యుత్‌షాక్‌తో ప్రమాదం ఉంటుందని విద్యుత్‌ నిపుణులు, అధికారులు జారీచేస్తున్నారు. చాలా చోట్ల సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ హైదరాబాద్‌ మహానగరంలో ఇంకా ఇప్పటికీ రెండున్నర లక్షల వరకు ఇనుప స్తంభాల వరకు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతియేటా వర్షాకాలంలో విద్యుత్‌ ఇనుప స్తంభాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లతో నగరంలో ఎదో ఒక ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌ సంఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి. నిరంతరంగా రోజుల తరబడి వర్షాలు కురవడం, లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాల చుట్టూ నీరు నిలవడంతో ఇనుప స్తంభాలు కిందిభాగంలో తుప్పు పట్టి ప్రమాదకరంగా మారుతున్నాయి. గత ఏడాది ముగ్గురు పిల్లలు విద్యుత్‌షాక్‌కు గురై మరణించారు.

నగరంలో ప్రధానంగా పాత హైదరాబాద్‌కు చెందిన బోరబండ, మోతీన గర్‌, చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, బేగంబజార్‌, రహమత్‌నగర్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, హఫీజ్‌పేట, కృష్ణానగర్‌, పార్శిగుట్ట, సనత్‌న గర్‌, అడ్డగుట్ట, మూసాపేట, అబిడ్స్‌, బాలానగ ర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాలలో ఎక్కువ భాగం ఇనుప స్తంభాలే ఉన్నాయి. ఇనుప స్తంభాలకు కరెంట్‌ సరఫరా అవుతుండడంతో షాక్‌ వస్తుందని, అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలకు కుప్పలు తెప్పలుగా ప్రైవేట్‌ కేబుల్స్‌ వేలాడుతున్నప్పటికీ క్షేత్రస్థాయి విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement