ప్రభన్యూస్ : గత నాలుగు ఐదు రోజలుగా వాతావరణంలో మార్పులు సంభవించి మబ్బులతో కొన్ని ప్రాంతాల్లో ముసురు.. వర్శాలు పడుతున్నాయి. దీంతో ఒక్క సారిగా జిల్లాలో అంటు వ్యాధులు పంజా విప్పుతున్నాయి. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్లు మొదలయ్యాయి. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా డెగ్యూ, వైరల్ ఫీవర్లు, వాంతులు, విరేచనాలు, మలేరియా వ్యాధులతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు దవాఖానలు రోగులతో నిండి పోతున్నాయి. ఒళ్లు నొప్పులు, తలనొప్పులు, వాంతులు, విరేచనాలు, వైరల్ ఫీవర్లు జనంపై పడగవిప్పి వ్యాధులు పంజా విసురుతున్నాయి. ప్రతీయేటా వర్శాకాలం ప్రారంభంలోనే వ్యాధులు ప్రభలడం సహజమే.. అయినప్పటికి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో జనంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.
వైరల్ ఫీవర్లు, డయేరియా కేసులు ఇతర అంటు వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉండడంతో అటు వైద్యారోగ్య శాఖ ఇటు గ్రామ పంచాయతీ అధికారులు, పాలకులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అయినప్పటికీ అంటు వ్యాధుల పట్ల వైద్యాధికారులు ఎలాంటటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో ముందస్తుగా ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖలు చర్యలు చేపడితే ఈ సమస్యలు తలెత్తవని గ్రామాల ప్రజలు కోరుతుతున్నారు. ఇప్పటికైన రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జనం రోగాల భారిన పడకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.