Sunday, November 17, 2024

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి : బీసీ సంక్షేమ సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల వారికి  చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలేకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణు మాధవ్ విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన వేణు మాధవ్ శాలువా కప్పి సన్మానించారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీల స్థితిగతులపై చర్చించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు తగినట్టుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా కృషి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణకారులకు ముద్ర లోన్స్ మంజూరుపై వేణు మాధవ్ ఆయనకు వివరించారు. విజయవాడలో ఇండియన్ బ్యాంక్ ద్వారా ముద్ర లోన్ల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రిని ఆయన ఆహ్వానించారు. స్వర్ణకారులు అభివృద్ధిలోకి రావాలని రామ్ దాస్ అథవాలే ఆకాంక్షించారని వేణు మాధవ్ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రమాణ స్వీకారానికి  రెండు తెలుగు రాష్ట్రాల బీసీ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement