Thursday, September 19, 2024

BCCI | టీమ్ఇండియా హోమ్ సీజ‌న్ షెడ్యూల్ ఇదే..

టీమ్ ఇండియా హోమ్ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. 2024-25లో భారత క్రికెట్ జట్టు 3 జట్లతో మొత్తం 5 సిరీస్‌లు ఆడనుంది. ఇందులో రెండు టెస్టు సిరీస్‌లు, రెండు టీ20 సిరీస్‌లు, ఒక వన్డే సిరీస్ ఉన్నాయి. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.

భారతదేశం హోమ్ షెడ్యూల్ 2024 సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుండ‌గా… బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న రెండు టెస్టుల సిరీస్‌తో ఈ హోం సీజ‌న్ ప్రారంభం కానుండ‌గా వ‌చ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జ‌రిగే మూడు వ‌న్డేల సిరీస్‌తో ముగియ‌నుంది.

2024-25 హోం సీజన్‌ షెడ్యూల్‌ వివరాలు ఇవే..

  • బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్ ల‌ టెస్టు, మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లు..

టెస్టు సిరీస్‌..

మొద‌టి టెస్ట్ – సెప్టెంబర్‌ 19 నుంచి 23 వరకు – చెన్నై వేదిక‌గా
రెండో టెస్ట్ – సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 1 వరకు – కాన్పూర్‌

టీ20 సిరీస్‌..

- Advertisement -

మొద‌టి టీ20 – అక్టోబర్ 6న – ధర్మశాల
రెండో టీ20 – అక్టోబర్ 9న – ఢిల్లీ
మూడో టీ20 – అక్టోబ‌ర్ 12న‌- హైదరాబాద్

  • న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌..

మొద‌టి టెస్ట్ – అక్టోబర్‌ 16 నుంచి 20 వరకు – బెంగళూరు
రెండో టెస్ట్ – అక్టోబర్‌ 24 నుంచి 28 వరకు – పూణే
మూడో టెస్ట్ – నవంబర్‌ 1 నుంచి 5 వరకు – ముంబై

  • ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్ ల‌ టీ20, మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్‌లు..

టీ20 సిరీస్‌..

మొద‌టి టీ20 – 2025 జనవరి 22న‌ – చెన్నై
రెండో టీ20 – జనవరి 25న‌ – కోల్‌కతా
మూడో టీ20 – జనవరి 28న‌ – రాజ్‌కోట్‌
నాలుగో టీ20 – జనవరి 31న‌ – పూణే
ఐదో టీ20 – ఫిబ్రవరి 2న‌ – ముంబై

వ‌న్డేలు..

తొలి వన్డే – ఫిబ్రవరి 6న‌ – నాగ్‌పూర్‌
రెండో వన్డే – ఫిబ్రవరి 9న‌ – కటక్‌
మూడో వన్డే – ఫిబ్రవరి 12న – అహ్మదాబాద్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement