Saturday, November 23, 2024

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు బీసీసీఐ రూ.1 కోటి నజరానా..

జపాన్ లోని టోక్యో వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒలంపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఈ ఒలింపిక్స్లో ఏడు పతకాలు సాధించింది. అందులో ఒక గోల్డ్ మెడల్ తో పాటు రెండు రజతాలు, నాలుగు కాంస్య పథకాలు ఉన్నాయి. కాగా వీరందరికీ ఇప్పటికే ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బిసిసిఐ కూడా టోక్యో ఒలంపిక్స్ లో పథకాలు వచ్చిన వారందరికీ కూడా రివార్డులు ప్రకటించింది. ముఖ్యంగా జావలిన్ త్రో లో గోల్డ్ మెడల్ సాధించి కొత్త రికార్డు సృష్టించిన మీరా చోప్రా కి కోటి నజరానా అందించాలని నిర్ణయించింది. రజత పతకాలు సాధించిన మీరాబాయి చాను, రవి దహియాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. కాంస్యాలు సాధించిన పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా బొర్గోహైన్ లకు రూ.25 లక్షల చొప్పున ప్రదానం చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇది కూడా చదవండి: అమరావతి ఉద్యమానికి 600 రోజులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement