Saturday, November 23, 2024

Asia Cup కు మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..

మహిళల ఆసియా కప్ 2024 కోసం బీసీసీఐ భారత మహిళల జట్టును ప్రకటించింది. జూలై 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయ‌గా… ఈ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిచ‌నుంది, వైస్ కెప్టెన్ గా స్మృతి మంధాన ఎంపికైంది.

కాగా, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ టోర్నీలో భారత్, నేపాల్, పాకిస్థాన్, యూఏఈ, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్ సహా 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించ‌గా.. ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక‌ సూపర్ ఫోర్‌లో చేరిన జట్లకు రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. వాటిల్లో గెలిచిన రెండు జట్లు జూలై 28 ఫైనల్ మ్యాచులో తలపడనున్నాయి. జూలై 28న జరిగే ఫైనల్ మ్యాచుతో ముగియనుంది.

ఆసియా కప్ గ్రూపులు ఇవే..

భారత మహిళల జట్టు… పాకిస్థాన్, యూఏఈ, నేపాల్‌తో పాటు గ్రూప్-ఎలో ఉంది. ఇక గ్రూప్ బీలో ఆతిథ్య శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, మలేషియా, థాయ్‌లాండ్ జట్లు ఉన్నాయి.

- Advertisement -

భారత మ‌హిళ‌ల జ‌ట్టు :

హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (డబ్ల్యుకె), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.

మహిళల ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్..

భారత్ vs పాకిస్థాన్ – జులై 19న
ఇండియా vs యూఏఈ – జులై 21స
భారత్ vs నేపాల్ – జులై 23న

భారత మ్యాచ్‌లు అన్ని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement