టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. కాగా, ఈ పర్యటనకు (గురువారం) భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని చేపట్టనుండగా… వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
టీ20 జట్టు : సూర్యకుమార్ యాదవ్ (సి), శుభమన్ గిల్ (విసి), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్), సంజు శాంసన్ (వికెట్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్.
వన్డే జట్టు : రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్), రిషబ్ పంత్ (వికెట్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
ఈ పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పల్లెకెలె వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్‌లు జూలై 27న ప్రారంభమై జూలై 30న ముగుస్తాయి. ఇక వన్డేలు ఆగస్టు 02 – 07 వరకు కొలంబో వేదికగా జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, ఆయన స్థానంలో నియమితులైన గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.