వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో మంచి జోరు మీదుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగింటిలోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రేపు (ఆదివారం) పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్‌తో జట్టుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.
కాగా, వరుస విజయాలతో ఈ ప్రపంచకప్‌లో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లకు కాస్త బ్రేక్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ధర్మశాల వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ తరువాత.. టీమింఇండియా తన తర్వాతి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడనుంది.
అక్టోబర్ 29న లఖ్నోలో ఈ మ్యాచ్ జరగనుండగా.. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య వారం రోజుల గ్యాప్ వస్తొంది. దీంతో ఓ మూడు రోజుల పాటు క్రికెటర్లు ఇంటికి వెళ్లి తమ కుటుంబసభ్యులతో గడిపేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ బ్రేక్ కారణంగా ఫామ్ తప్పకూడదనే ఉద్దేశంతో.. అక్టోబర్ 26 నాటికి ప్లేయర్లు అందరూ లఖ్నో చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాలని బీసీసీఐ స్పష్టం చేసిందట.