ఐపీఎల్ – 2022 అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు ఐపీఎల్ నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చలు జరిపింది. ఆటగాళ్ల బయో బబూల్, మ్యాచ్ ల నిర్వహాణ, మైదనాలతో పాటు ప్రేక్షకుల అనుమతికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో బీసీసీఐ చర్చలు జరిపింది. కాగ ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో 25 శాతం ఆక్యుపెన్సీతో ప్రేక్షకుల అనుమతికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీసీసీఐ కూడా ఐపీఎల్ నిర్వహకులకు మైదానంలో 25 శాతం సామర్థ్యంతో ప్రేక్షకుల అనుమతి ఇచ్చింది.
అంతే కాకుండా కరోనా పరిస్థితులను బట్టి ప్రేక్షకుల సామర్థ్యం పెంచుతామని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, బీసీసీఐ తెలిపాయి. కాగ మార్చి 14, 15 తేదీల నుంచే ఐపీఎల్ – 2022 కోసం ప్రాక్టిస్ ప్రారంభం కానుంది. కాగ మార్చి 26 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..