ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు వేదికలు ఖరారయ్యాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు, హైదరాబాద్, ధర్మశాల నగరాల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. మరో వైపు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా అవాంతరాలు తొలగినట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ జట్టుకు ఎటువంటి వీసా సమస్యలు ఉండవని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు తెగిపోవడం వల్ల ఈ రెండు దేశాలు చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక టోర్నీల్లో పాల్గొనడం లేదు.
పాకిస్థాన్ ఆటగాళ్లు వీసా కల్పించే అంశంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు జే షా తెలియజేశారు. ఆటగాళ్లకు వీసాలు ఇచ్చినా.. ప్రేక్షకులకు వీసాలు ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని ఇంకా తేల్చలేదన్నారు. దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంలో ఐసీసీకి ప్రామిస్ ఛేశామన్నారు.