అక్టోబర్ 2020-సెప్టెంబర్ 2021 కాలానికి గానూ బీసీసీఐ గురువారం నాడు వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 28 మంది టీమిండియా ఆటగాళ్లు నాలుగు విభాగాల్లో చోటు దక్కించుకున్నారు. 2019 ప్రపంచకప్‌లో జట్టులో కీలకపాత్ర వహించిన చాహల్, కుల్‌దీప్‌లు తాజా కాంట్రాక్టుల్లో గ్రేడ్-ఎ నుంచి గ్రేడ్-సి విభాగానికి పడిపోయారు.
గ్రేడ్-ఎ ప్లస్ (రూ.7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా
గ్రేడ్-ఎ (రూ.5 కోట్లు): అశ్విన్, జడేజా, పుజారా, రహానె, ధావన్, కేఎల్ రాహుల్, షమీ, ఇషాంత్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా
గ్రేడ్-బి (రూ.3 కోట్లు): సాహా, భువనేశ్వర్, ఉమేష్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్
గ్రేడ్-సి (రూ.కోటి): కుల్దీప్, చాహల్, సైనీ, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, హనుమా విహారి, అక్షర్ పటేర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్bcc