టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోనున్నాడా? కోచ్ గా రాహుల్ ద్రవిడ్ భవితవ్యం ఏమిటి? వీరిద్దరి భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ త్వరలో ముంబయిలో సమావేశం నిర్వహించనుంది. దీనికి భారత కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ లను హాజరు కావాల్సిందిగా కోరింది. బంగ్లాదేశ్ పర్యటనకు ముందే వీరిద్దరినీ బీసీసీఐ అధికారులు కలవనున్నారు. ఈ భేటీలో వీరి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీ20 కెప్టెన్సీ వదులుకునేందుకు రోహిత్ సిద్ధం
టీ20 కెప్టెన్ నుంచి తప్పుకునేందుకు రోహిత్ శర్మ సుముఖంగా ఉన్నాడనే వార్తలు కూడా కొన్నిరోజుల క్రితం వచ్చాయి. దీనిపై రోహిత్ శర్మతో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారని.. హార్దిక్ కు టీ20 పగ్గాలు అప్పగించటంలో రోహిత్ కు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లుగా సమాచారం.
BCCI Calls On Rohit Sharma & Rahul Dravid For Review Meeting – dlovesk https://t.co/nMHRmwOLfK
— dlovesk.com (@dloveskdotcom) November 28, 2022