జింబాబ్వేలో త్వరలో వన్డే, టీ-20 సిరీస్ ఆడేందుకు వెళ్లే భారత క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించారు. వెస్టిండీస్‌లో ఇటీవలే ముగిసిన టీ-20 సిరీస్‌కు నాయకత్వం వహించిన బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. ఆ సిరీస్‌లో ఇండియా వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కొత్త ఆటగాడు రాహుల్ త్రిపాఠీకి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. ఆరేళ్ల తర్వాత జింబాబ్వేలో ఆడేందుకు భారత్ వెడుతూండటం విశేషం. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ టెస్ట్, వన్డే, టీ-ట్వంటీ సిరీస్‌లలో కోహ్లీ విఫలమైన నేపథ్యంలో విండీస్ టూర్‌కు ఎంపిక చేయలేదు. కాగా జింబాబ్వే టూర్ జట్టుకూ దూరంగా ఉంచారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమయ్యేలా కోహ్లీకి విశ్రాంతినివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. కాగా జింబాబ్వేతో ఆడే జట్టులో దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌లకు మళ్లి అవకాశం ఇచ్చారు. కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠికి పిలుపువచ్చింది. గతనెలలో ఐర్లాండ్‌తో జరిగిన టూర్‌కు త్రిపాఠీని ఎంపిక చేసినప్పటికీ ఒక్క గేమ్‌లోనూ అవకాశం దక్కలేదు.
ఇదీ జట్టు..
శిఖర్ ధావన్ (కె), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హూడా, రాహుల్ త్రిఫాటీ, ఐషాన్ కిషన్ (వికెట్ కీపర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దిప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాద్, దీపక్ చాహర్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.