హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకంలో ఆర్ధిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 20 తేదీ నుంచి జరగనుంది. అందుకు సంబంధించిన వివరాలను ఈపాస్ తెలంగాణ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని బీసీ వెల్ఫేర్ కమీషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్చి 2022లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ ఈపాస్ డాట్ సీజీజీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో పొందు పరిచిన వివరాల ప్రకారం తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.
ఈ పథకం కోసం మొత్తం 571 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 438 మంది బీసీ కులాలకు చెందిన వారు ఉండగా, 133 మంది ఇబీసీ కులాలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తుదారులకు ఇప్పటికే ఎస్‌ఎంఎస్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ, సమయం, కార్యాలయం చిరునామా వివరాలను పంపించామన్నారు. వారికి పంపించిన తేదీల ప్రకారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ వద్ద సంక్షేమ భనన్ ఆరో అంతస్థులో ఉన్న కార్యాలయంలో హాజరు కావాలని ఆయన సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.