Wednesday, November 6, 2024

Delhi | జగన్ చొరవతో బీసీ బిల్లు.. వైసీపీ నేతలను కలిసిన బీసీ సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో  జగన్ చొరవతో బీసీ బిల్లు డిమాండ్ ముందుకు వెళ్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తమ డిమాండ్ల సాధనకు రెండు రోజులుగా ఢిల్లీలో ధర్నా చేపడుతున్న బీసీ సంఘం నేతలు బుధవారం పార్లమెంట్‌లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డిని కలిసి బీసీ బిల్లు అంశంపై చర్చించారు.

వైసీపీతో పాటు వివిధ పార్టీలు తమ డిమాండ్లకు మద్దతునివ్వడంతో బీసీ ఉద్యమానికి మరింత ఊపు వచ్చిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇంఛార్జి కర్రి వేణుమాధవ్ అన్నారు. ఎంపీ ఆర్. కృష్ణయ్య వివిధ పార్టీల్లో ఉన్న వెనుకబడిన వర్గాల నాయకులను సమన్వయం చేసి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తమ డిమాండ్లను తీసుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement