Wednesday, November 20, 2024

తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీర

తెలంగాణలో బతుకమ్మ పండగ దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుల్లో పేరు నమోదై ఉండి, 18 ఏళ్లు నిండిన వారందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా చీరలను పంపిణీ చేయడానికి వీలుగా జిల్లాలకు సరుకును పంపించే ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది.

కాగా బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్రాలను రేషన్‌ దుకాణాల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లాల్లో కలెక్టర్లు దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలని, చీరల పంపిణీ కోసం మండల, నియోజకవర్గ స్థాయిలో ఇన్‌చార్జీలను నియమించాలని సూచించింది. పంపిణీ చేసిన తర్వాత మిగిలిన చీరలను అక్టోబరు 31వ తేదీలోగా గోడౌన్లకు చేర్చాలని, వాటిని నవంబరు 15లోగా స్వాధీనం చేసుకోవాలని టెస్కోను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ వార్త కూడా చదవండి: పార్లమెంట్‌‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ ఎన్వీ రమణ

Advertisement

తాజా వార్తలు

Advertisement