Thursday, November 21, 2024

పీవీ సింధుకు సారీ చెప్పిన బీఏటీసీ .. ఎందుకో తెలుసా?

భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధుకు బాడ్మింటన్‌ ఏసియా టెక్నికల్‌ కమిటీ (బీఏటీసీ) క్షమాపణలు చెప్పింది. గత ఏప్రిల్‌లో జరిగిన బాడ్మింటన్‌ ఏసియా చాంపియన్‌ షిప్‌ పోటీలలో పాల్గొన్న సింధు విమెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో అర్థంతరంగా వెనుదిరిగింది. అంపైర్ల తప్పుడు నిర్ణయంతో ఆమె కన్నీటి పర్యంతమై వెనుదిరగాల్సి వచ్చింది. కాగా రిఫరీ నిర్ణయం మానవ తప్పిదంగా తేల్చిన బీఏటీసీ చైర్మన్‌ చిన్‌ షెన్‌ చెన్‌ క్షమాపణలు చెప్పారు. అంపైర్ల తప్పిదం వల్ల జపాన్‌కు చెందిన అకెనె యమగుచితో జరిగిన మ్యాచ్‌లో సింధు అర్ధంతరంగా వెనక్కి వెళ్లిపోయారు.

మొదటి గేమ్‌ను గెలుచుకున్న సింధు రెండో గేమ్‌లో 14-11తో ఆధిక్యంలో ఉన్నప్పుడు అంపైర్‌ జోక్యం చేసుకుని ఒక పాయింట్‌ పెనాల్టి విధించారు. షటిల్‌ను యమగుచికి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఫలితంగా ఆ మ్యాచ్‌ చేజారిపోయింది. జపాన్‌ క్రీడాకారిణి యమగుచికి కాంస్య పతకం లభించింది. ఇప్పుడు ఏమీ చేయలేకపోయినప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని షెన్‌ ప్రకటించారు. కాగా ఆ మ్యాచ్‌లొ రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింధు ఏసియా బ్యాడ్మింటన్‌ కాన్ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement