Tuesday, November 19, 2024

liquor scam | కేసీఆర్‌‌పై నిరాధార ఆరోపణలు.. 16 ఛానళ్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న పలు మీడియా ఛానళ్లపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ తరఫున బాల్క సుమన్‌ ఫిర్యాదు చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో కేసీఆర్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో పాటు పలు మీడియా ఛానళ్లు అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బాల్క సమన్‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాల్క సుమన్‌ కోరారు. లిక్కర్‌ స్కాం కేసులో కేసీఆర్‌ పేరును ఈడీ ప్రస్తావించినట్లు నిరాధార ఆరోపణలను కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయని తెలిపారు.

ఈ విషయంలో 16 న్యూస్‌ ఛానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. నిర్ధారణ చేసుకున్న తర్వాతే వార్తలు ప్రసారం చేయాలని సూచించారు. ప్రసార మాధ్యమాలు ప్రజాగొంతుకగా ఉండాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement